ఈ ట్రాఫిక్‌కు... ఈ వాహనాలే కరెక్ట్ : ఆనంద్ మహీంద్ర

ABN , First Publish Date - 2020-07-14T23:50:16+05:30 IST

డిఫెన్స్ కోసం ప్రత్యేక వాహనాలను తయారు చేసిన మహీంద్రా సంస్థ... మందుపాతరల నుంచి రక్షణ కోసం కూడా వాహనాలను తయారు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలను... మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఈ ట్రాఫిక్‌కు... ఈ వాహనాలే కరెక్ట్ : ఆనంద్ మహీంద్ర

ముంబై : డిఫెన్స్ కోసం ప్రత్యేక వాహనాలను తయారు చేసిన మహీంద్రా సంస్థ... మందుపాతరల నుంచి రక్షణ కోసం కూడా వాహనాలను తయారు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలను... మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు.


ఈ క్రమంలో... ‘భారతదేశంలో  బెంగళూరు తర్వాత అతి ఎక్కువ ట్రాఫిక్ ఉండే నగరం ముంబై. ఎప్పుడు చూసినా రోడ్లన్నీ రద్దీగా ఉంటాయి. ముంబైలో ప్రయాణాలకుచాలా సమయం పడుతుంటుంది’ అని పేర్కొన్న మహీంద్ర... రక్షణరంగం కోసం తాము తయారు చేసిన ప్రత్యేక వాహనానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.


సైనికులు సురక్షితంగా ఉండేందుకు ఈ వాహనాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని చెప్పారు. ముంబై ట్రాఫిక్ లో నడిపేందుకు అనువుగా ఉంటాయంటూ ఈ సందర్భంగా ఓ ఛలోక్తి విసిరారు. 


మందు పాతరలను వెలికి తీసేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి సైన్యం ఈ వాహనాలను వినియోగించనుంది. ఈ వాహనాల గురించి ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ సరదా సరదా వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2020-07-14T23:50:16+05:30 IST