లాక్‌డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ స్థంభించిపోయింది: ఏకే ఆంటోని

ABN , First Publish Date - 2020-05-10T23:26:56+05:30 IST

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ స్థంభించిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఏకే ఆంటోని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేదంటే పరిస్థితులు

లాక్‌డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ స్థంభించిపోయింది: ఏకే ఆంటోని

తిరువనంతపురం: కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ స్థంభించిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఏకే ఆంటోని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేదంటే పరిస్థితులు మరింత దిగజారవచ్చని ఆయన హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.


‘‘లాక్డౌన్ వల్ల పేదల కష్టాలు పెరిగాయి. ఇది ఇలాగే కొనసాగితే మరిన్ని కష్టాలు పెరుగుతాయి. ఆకలిని ఆకలి మరణాలను నివారించడానికి ప్రధాని మోడీ జోక్యం చేసుకోవాలి. క్షేత్ర స్థాయిలో పరిస్థితి చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వ జోక్యం లేకుంటే ఆకలి కారణంగా మరణాలు సంభవించే మరణాలు కోవిడ్-19 మరణాలను అధిగమిస్తాయి. లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ స్థంభించిపోయింది.  వ్యాపారాలను తిరిగి ప్రారంభించడానికి సకాలంలో చర్యలు తీసుకోకపోతే, మొత్తం ఆర్థిక వ్యవస్థే సంక్షోభంలో పడుతుంది’’ అని ఏకే ఆంటోని అన్నారు.

Updated Date - 2020-05-10T23:26:56+05:30 IST