ఎవరెన్ని చెప్పినా.. ఆర్టికల్ 370 మళ్లీ రాదు: తేల్చేసిన కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2020-12-13T11:45:05+05:30 IST

జమ్మూకశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370పై ఇప్పటికీ రచ్చ జరుగుతూనే ఉంది. ఇటీవల ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖ రాజకీయనేతలు ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ కూడా ఈ విషయంలో వివాదాస్పద కామెంట్లు చేశారు.

ఎవరెన్ని చెప్పినా.. ఆర్టికల్ 370 మళ్లీ రాదు: తేల్చేసిన కేంద్ర మంత్రి

కశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370పై ఇప్పటికీ రచ్చ జరుగుతూనే ఉంది. ఇటీవల ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖ రాజకీయనేతలు ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ కూడా ఈ విషయంలో వివాదాస్పద కామెంట్లు చేశారు. వీటిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ స్పందించారు. ఎవరెన్ని చెప్పినా ఆర్టికల్ 370 మళ్లీ రావడం జరగబోదని ఆయన తేల్చి చెప్పారు.


‘‘ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ చైనా సాయం తీసుకుంటానంటారు. మెహబూబా ముఫ్తీ ఏమో మనకు ఉగ్రవాదం తప్పితే ఎటువంటి సాయమూ చేయని పాకిస్తాన్ సాయం తీసుకుంటాను అంటారు. ఎలాగైనా సరే ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తాం అని వాళ్లు చెప్తున్నారు. కానీ నేను చెప్పేదొక్కటే.. ఈ చట్టం పోయిందంతే, మళ్లీ తిరిగి రావడం జరగదు’’ అని అనురాగ్ స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-13T11:45:05+05:30 IST