12 గంటల పని.. ఓవర్‌టైం వేతనమూ లేదు

ABN , First Publish Date - 2020-12-19T07:02:30+05:30 IST

బెంగళూరు శివారులో కోలారు జిల్లా నరసాపుర పారిశ్రామిక వాడలో ఉన్న ఐఫోన్‌ కంపెనీ విస్ట్రాన్‌లో కార్మిక చట్టాల ఉల్లంఘన యథేచ్ఛగా

12 గంటల పని.. ఓవర్‌టైం వేతనమూ లేదు

‘ఐఫోన్‌-విస్ట్రాన్‌’లో కార్మిక చట్టాల ఉల్లంఘన


బెంగళూరు, డిసెంబరు 18:  బెంగళూరు శివారులో కోలారు జిల్లా నరసాపుర పారిశ్రామిక వాడలో ఉన్న ఐఫోన్‌ కంపెనీ విస్ట్రాన్‌లో కార్మిక చట్టాల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతున్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. షిఫ్టును 12 గంటలపాటు నిర్వహించడంతోపాటు అదనపు పనిగంటలకు వేతనం కూడా చెల్లించడం లేదని గుర్తించారు. కంపెనీని ప్రాథమిక పరిశీలన చేసిన కార్మిక శాఖ అధికారులు ఆడిట్‌ నివేదికను స్వాధీనం చేసుకున్నారు. దీని ప్రకారం కంపెనీ కార్మిక చట్టాలను ఏమాత్రం పాటించడంలేదని గుర్తించారు. పలు విషయాలను కంపెనీ దృష్టికి తీసుకువెళ్లామని, అయితే.. ఎవరూ స్పందించలేదని ఓ అధికారి వివరించారు.

Read more