రాజస్థాన్‌లో ‘పట్టణ స్థానికం’ కాంగ్రెస్‌దే
ABN , First Publish Date - 2020-12-15T08:16:12+05:30 IST
రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీపై ఆధిక్యం సంపాదించింది.

619 వార్డుల్లో కాంగ్రెస్.. 595 వార్డుల్లో స్వతంత్రుల గెలుపు
జైపూర్, డిసెంబరు 14: రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీపై ఆధిక్యం సంపాదించింది. అంతకు ముందు గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి బీజేపీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా మొత్తం 12 జిల్లాల్లో 50 మునిసిపాలిటీలకుకు జరిగిన ఎన్నికల్లో 14చోట్ల కాంగ్రెస్, 4చోట్ల బీజేపీ గెలిచాయి. మొత్తం 1775 వార్డులకు గాను, కాంగ్రెస్ 619 వార్డులు గెలిచింది. స్వతంత్ర అభ్యర్థులు 595 వార్డులు గెలిచి రెండో స్థానంలో ఉన్నారు. 549 వార్డులతో బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది. మొత్తంగా 32 మునిసిపల్ మండళ్లలో స్వతంత్రులు నిర్ణయాత్మకంగా మారనున్నారు. 17చోట్ల సొంతంగా, మిగిలిన 24చోట్ల స్వతంత్రుల సాయంతో బోర్డును ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటాసరా ధీమా వ్యక్తం చేశారు.