కోలుకోని బాలు

ABN , First Publish Date - 2020-08-22T08:32:16+05:30 IST

చెన్నై, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): కరోనాతో చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య

కోలుకోని బాలు

చెన్నై, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): కరోనాతో చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఇంకా కుదుటపడలేదని, అయితే, ప్రస్తుతానికి మాత్రం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ అనురాధ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.


ఎస్పీబీకి ఐసీయూలో వెంటిలేటర్‌, ఎక్మో సాయంతో వైద్యనిపుణులు నిరంతరం చికిత్స అందిస్తున్నారన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు బాలు కుటుంబసభ్యులకు వివరిస్తున్నారని పేర్కొన్నారు. కాగా, తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కరన్‌ ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందన్నారు.


బాలు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలంటూ సినీ ప్రముఖులు గురువారం సాయంత్రం చేసిన సామూహిక ప్రార్థనలు ఫలిస్తాయని ఎస్పీ చరణ్‌ గురువారం నాటి ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

Updated Date - 2020-08-22T08:32:16+05:30 IST