వారందరి మొత్తం వయసు 1042 ఏళ్లు!

ABN , First Publish Date - 2020-12-27T09:56:55+05:30 IST

వారందరి మొత్తం వయసు 1042 ఏళ్లు!

వారందరి మొత్తం వయసు 1042 ఏళ్లు!

12 మంది తోబుట్టువుల గిన్నిస్‌ రికార్డు


టొరంటో, డిసెంబరు 26: వారందరూ 12మంది తోబుట్టువులు. అందరిలోకి పెద్ద వ్యక్తి వయసు 97ఏళ్లు కాగా.. చిట్టచివరి చెల్లెలి వయసు 75ఏళ్లు. ఈ క్రమంలో అందరి వయసూ కలిపి 1042ఏళ్ల 315 రోజులుగా లెక్కతేలింది. దీంతో వారికి గిన్నిస్‌ రికార్డు సొంతమైంది. డెక్రూజ్‌ కుటుంబానికి చెందిన  మైకేల్‌, సిసిలియా దంపతులు పాకిస్థాన్‌లోని కరాచీలో 12మంది సంతానాన్ని కన్నారు. వారిలో 9మంది ఆడసంతానం, మగ్గురు మగసంతానం ఉన్నారు. వీరిలో అత్యంత పెద్దవాడైన డొరీన్‌ లూయిస్‌ 1923, సెప్టెంబరు 23న జన్మించారు. అత్యంత చిన్నదైన యూజీనియా కార్టర్‌ 1945, అక్టోబరు 24న జన్మించారు. మిగిలిన వారంతా వీరిద్దరికీ మధ్య కాలంలో జన్మించారు. తోబుట్టువులందరి జనన ధ్రువీకరణ పత్రాలను, పౌరసత్వ కార్డులను పరిశీలించిన గిన్నిస్‌, ఈ నెల 15న రికార్డును ధ్రువీకరించింది.

Updated Date - 2020-12-27T09:56:55+05:30 IST