ఢిల్లీలో ఠారెత్తిస్తున్న ఎండలు
ABN , First Publish Date - 2020-05-24T21:25:21+05:30 IST
దేశరాజధానిలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.

న్యూఢిల్లీ: దేశరాజధానిలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజు రోజు పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. ఢిల్లీలో సోమవారం పగటిపూట ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్ దాటుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాజస్థాన్‌లోనూ ఇవాళ, రేపు అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఢిల్లీలో ఈ సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రత నిన్న నమోదయింది. పాలం ప్రాంతంలో 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. రాజస్థాన్‌లోని చురూలో నిన్న 46.6 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. వచ్చే నాలుగు నుంచి ఐదు రోజుల్లో పంజాబ్, హరియాణ, చండీఘడ్, విదర్భ ప్రాంతాల్లో ఎండలు మండిపోయే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.