సీఎం నితీశ్ సారథ్యంలో 5 ఏళ్లూ కొనసాగుతాం : సుశీల్ మోదీ

ABN , First Publish Date - 2020-12-28T18:24:45+05:30 IST

సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో జేడీయూ, బీజేపీ కూటమి 5 ఏళ్లూ కొనసాగుతుందని రాజ్యసభ సభ్యుడు సుశీల్ మోదీ ప్రకటించారు. జేడీయూ

సీఎం నితీశ్ సారథ్యంలో 5 ఏళ్లూ కొనసాగుతాం : సుశీల్ మోదీ

పాట్నా : సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో జేడీయూ, బీజేపీ కూటమి 5 ఏళ్లూ కొనసాగుతుందని రాజ్యసభ సభ్యుడు సుశీల్ మోదీ ప్రకటించారు. జేడీయూ, బీజేపీ కూటమికి ఎలాంటి ఢోకా లేదని ఆయన ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన సంఘటనతో బిహార్‌లో సంకీర్ణ ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని జేడీయూ నేతలే అన్నారని ఆయన గుర్తు చేశారు. తానేమీ సీఎం పదవి కావాలని కోరుకోలేదన్న సీఎం నితీశ్ వ్యాఖ్యలపై కూడా మోదీ స్పందించారు. ‘‘సీఎం పోస్టు కావాలని నితీశ్ కోరుకోలేదు. మీ నేతృత్వంలోనే, మీ పేరుతోనే, మీ విజన్‌తోనే ఎన్నికల్లో ముందుకెళ్లామని మేం నితీశ్‌తో చెప్పాం. ఈ విషయాలపైనే ప్రజలు ఓటు వేశారు. చివరకు... బీజేపీ, జేడీయూ, వీఐపీ నేతల ఒత్తిడి మేరకు సీఎం పదవిని చేపట్టేందుకు నితీశ్ అంగీకరించారు.’’ అని బీజేపీ నేత సుశీల్ మోదీ వెల్లడించారు. 

Updated Date - 2020-12-28T18:24:45+05:30 IST