కొవిడ్‌ ఫైలు పైనే తొలి సంతకం

ABN , First Publish Date - 2020-12-11T09:40:12+05:30 IST

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే బస్సులు, రైళ్లతో పాటు బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసే ఉత్తర్వులపై మొదటి సంతకం చేస్తానని జో బైడెన్‌ చెప్పారు.

కొవిడ్‌ ఫైలు పైనే తొలి సంతకం

100 రోజుల్లో 10కోట్ల వ్యాక్సినేషన్లు: బైడెన్‌ 


వాషింగ్టన్‌, డిసెంబరు 10: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే బస్సులు, రైళ్లతో పాటు బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసే ఉత్తర్వులపై మొదటి సంతకం చేస్తానని జో బైడెన్‌ చెప్పారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్రాల గవర్నర్లు, నగరాల మేయర్ల సహకారం తీసుకుంటామన్నారు. తొలి 100 రోజుల్లోనే కరోనాపై పోరాటానికి మూడంచెల ప్రణాళికను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా 10 కోట్ల కొవిడ్‌ వ్యాక్సినేషన్లు అందుబాటులోకి తెస్తామన్నారు. దేశవ్యాప్తంగా విద్యాలయాలు వీలైనంత త్వరగా తెరుచుకునేలా చూడటమే తమ ప్రాధాన్యమన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన నిధులను కాంగ్రెస్‌ అందించాలని కోరారు. 

Updated Date - 2020-12-11T09:40:12+05:30 IST