కరోనా నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2020-03-25T22:11:32+05:30 IST
కరోనా వైరస్‌ను కట్టడి చేసే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం...

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను కట్టడి చేసే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి జరగాల్సి ఉన్న మొదటి దశ జనాభా లెక్కింపును వాయిదా వేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఎన్‌పీఆర్‌ను కూడా వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది.
అంతేకాదు.. జనాభా లెక్కలను నిరవధికంగా వాయిదా వేసినట్లు కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రజలంతా 21 రోజులు లాక్‌డౌన్ పాటించాలని దేశ ప్రధాని మోదీ ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.