బెంగళూరు- శాన్‌ఫ్రాన్సిస్కో మధ్య తొలి నాన్‌స్టా్‌ప విమానం

ABN , First Publish Date - 2020-11-27T07:38:57+05:30 IST

గార్డెన్‌ సిటీ బెంగళూరు నగరం నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు ఎయిర్‌ ఇండియా నాన్‌స్టా్‌ప విమానాన్ని నడపనుంది. 2021 జనవరి 11న తొలి విమానం బెంగళూరు నుంచి బయల్దేరనుంది

బెంగళూరు- శాన్‌ఫ్రాన్సిస్కో మధ్య తొలి నాన్‌స్టా్‌ప విమానం

బెంగళూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): గార్డెన్‌ సిటీ బెంగళూరు నగరం నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు ఎయిర్‌ ఇండియా నాన్‌స్టా్‌ప విమానాన్ని నడపనుంది. 2021 జనవరి 11న తొలి విమానం బెంగళూరు నుంచి బయల్దేరనుంది. ఈ విషయాన్ని బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు గురువారం తెలిపారు. మనదేశం నుంచి సుదీర్ఘ సమయం ప్రయాణించనున్న తొలి విమానం ఇదే. బెంగళూరు నుంచి 14 వేల కిలోమీటర్ల దూ రాన్ని 16 గంటలపాటు నిరంతరాయంగా ప్రయాణించి ఈ విమానం శాన్‌ఫ్రాన్సిస్కో చేరుకోనుంది. ఇప్పటికే టికెట్ల రిజర్వేషన్‌ను ప్రారంభించామని వారంలో రెండు రోజుల పాటు ఈ విమాన సేవలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

Read more