దేశ మొదటి ఆస్కార్‌ విజేత భాను కన్నుమూత

ABN , First Publish Date - 2020-10-16T06:58:59+05:30 IST

భారతదేశ మొదటి ఆస్కార్‌ అవార్డు విజేత, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ భాను అథయ్య (91) కన్నుమూశారు. గురువారం ఉదయం ముంబైలోని తన నివాసంలో ఆమె చనిపోయారు...

దేశ మొదటి ఆస్కార్‌ విజేత భాను కన్నుమూత

ముంబై, అక్టోబరు 15: భారతదేశ మొదటి ఆస్కార్‌ అవార్డు విజేత, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ భాను అథయ్య (91) కన్నుమూశారు. గురువారం ఉదయం ముంబైలోని తన నివాసంలో ఆమె చనిపోయారు. కొన్నేళ్లుగా ఆమె పక్షవాతంతో బాధపడుతున్నా రు. దక్షిణ ముం బైలో తన తల్లి అంత్యక్రియలు జరిగాయని ఆమె కూతురు వెల్లడించారు. 1983లో వచ్చిన ‘గాంధీ’ చిత్రానికి గాను అథయ్య.. ఆస్కార్‌ పురస్కారాన్ని అందుకున్నారు. 1956లో వచ్చిన ‘సీఐడీ’ చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలో కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ఆమె తన వృత్తిని ప్రారంభించారు. 50 ఏళ్ల పాటు 100కు పైగా చిత్రాలకు  పనిచేశారు. ‘లెకిన్‌’, ‘లగాన్‌’ చిత్రాలకు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు.

Updated Date - 2020-10-16T06:58:59+05:30 IST