డ్రైవర్‌ రహిత మెట్రో రైలు పరుగులు

ABN , First Publish Date - 2020-12-29T09:02:54+05:30 IST

దేశంలోనే మొట్టమొదటి డ్రైవర్‌ రహిత మెట్రో రైలు ఢిల్లీలో ప్రారంభమైంది. ఉత్తర జనక్‌పురి-బొటానికల్‌ గార్డెన్‌ స్టేషన్ల మధ్య 37 కిలోమీటర్ల

డ్రైవర్‌ రహిత మెట్రో రైలు పరుగులు

న్యూఢిల్లీ, డిసెంబరు 28: దేశంలోనే మొట్టమొదటి డ్రైవర్‌ రహిత మెట్రో రైలు ఢిల్లీలో ప్రారంభమైంది. ఉత్తర జనక్‌పురి-బొటానికల్‌ గార్డెన్‌ స్టేషన్ల మధ్య 37 కిలోమీటర్ల మేర ప్రయాణించే ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం పట్టణీకరణ, అభివృద్ధిని అవకాశాలుగా మలచుకుంటోందని ఉద్ఘాటించారు. ‘‘2014కు ముందు దేశంలో కేవలం ఐదు నగరాల్లోనే మెట్రో రైలు సేవలు ఉండేవి. 248 కిలోమీటర్ల దూరానికే మెట్రో సేవలు ఉండేవి. మేము మరో 13 నగరాలకు మెట్రోను విస్తరించాం. ఇప్పుడు 18 నగరాల్లో మెట్రో రైళ్లు.. 700 కిలోమీటర్లకు పైగా దూరంలో పరుగులు తీస్తున్నాయి’’ అని ఆయన అన్నారు.


ఇదే సందర్భంలో ‘నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డు’ సేవలను ప్రధాని ప్రారంభించారు. వీటి వల్ల ప్రయాణికులు తమకు నచ్చిన ప్రాంతాలకు.. నచ్చిన ప్రజారవాణా వ్యవస్థను ఎంచుకుని ప్రయాణించవచ్చు. కాగా ఉద్యాన రైతులు తమ పంటలను ఇతర ప్రాంతాల్లో అమ్ముకునేందుకు ఉద్దేశించిన కిసాన్‌ రైళ్ల సంఖ్య నాలుగు నెలల్లో 100కు చేరింది. మొదటి కిసాన్‌ రైలు ఆగస్టు 7న ప్రారంభం కాగా.. మహారాష్ట్రలోని సంగోలా నుంచి పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్‌ మధ్య నడిచే 100 ‘కిసాన్‌ రైలు’ను ప్రధాని మోదీ సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ రైళ్లలో రవాణా చార్జీల్లో రైతులకు 50ు రాయితీ ఉంటుంది. 

Updated Date - 2020-12-29T09:02:54+05:30 IST