సరిహద్దుల్లో మళ్లీ బుసకొడుతున్న డ్రాగన్

ABN , First Publish Date - 2020-07-22T16:25:57+05:30 IST

సరిహద్దుల్లో డ్రాగన్ దేశం మళ్లీ బుసకొడుతోంది.

సరిహద్దుల్లో మళ్లీ బుసకొడుతున్న డ్రాగన్

లడక్: సరిహద్దుల్లో డ్రాగన్ దేశం మళ్లీ బుసకొడుతోంది. వాస్తవాధీనరేఖ వెంబడి ప్యాంగాంగ్ సరస్సు సమీపంలోని ఫింగర్ 5 నుంచి  తన బలగాలను ఉపసంహరించుకునేందుకు చైనా నిరాకరిస్తోంది. ఇటీవలే ఫింగర్ 4 నుంచి కదిలేందుకు నిరాకరించిన చైనా.. తాజాగా ఫింగర్ 5 వద్ద కూడా అదే మొండి వైఖరి కనబరుస్తోంది. బారత్, చైనా సైనిక కమాండర్ల మధ్య నాలుగోసారి జులై 14న చూసుల్ వద్ద జరిగిన చర్చల తర్వాత బలగాలను ఉపసంహరించే ప్రక్రియ వేగవంతం చేశారు. అయితే చైనా బలగాల కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి.


అండమాన్‌లో భారత్, అమెరికా నావీ యుద్ధ విన్యాసాల కారణంగా చైనా బలగాలు ఫింగర్ 5 నుంచి కదలడం లేదని అనుమానిస్తున్నారు. అదే సమయంలో ఈనెల 29న రఫెల్ యుద్ధ విమానాలను అంబాల లేదా లడక్‌లో మోహరించనున్న నేపథ్యంలో కూడా చైనా బలగాలు ఫింగర్ 5 నుంచి కదలడంలేదని సమాచారం. చైనా బలగాల తీరు చూస్తుంటే సైనిక కమాండర్ల మధ్య  ఐదోసారి చర్చలు జరపాల్సి రావచ్చని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2020-07-22T16:25:57+05:30 IST