వచ్చే నెల 10 వరకు హజ్‌ దరఖాస్తుల గడువు

ABN , First Publish Date - 2020-12-11T09:43:25+05:30 IST

వచ్చే ఏడాది హజ్‌ యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తు గడువును జనవరి 10 వరకు పొడిగించినట్లు కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తెలిపారు.

వచ్చే నెల 10 వరకు హజ్‌ దరఖాస్తుల గడువు

ముంబై, డిసెంబరు 10: వచ్చే ఏడాది హజ్‌ యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తు గడువును జనవరి 10 వరకు పొడిగించినట్లు కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తెలిపారు. యాత్రికులు ఎంచుకునే ప్రయాణాన్ని (విమానం లేదా ఓడ) బట్టి ఖర్చులో తేడా ఉంటుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్‌-జూలై నెలల్లో జరిగే హజ్‌ యాత్రను కరోనా నేపథ్యంలో భారత్‌, సౌదీ అరేబియా ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తామని తెలిపారు. 

Updated Date - 2020-12-11T09:43:25+05:30 IST