ఈనెల 30న బాబ్రీ కేసు తీర్పు

ABN , First Publish Date - 2020-09-17T07:50:42+05:30 IST

బాబ్రీ మసీదు నేలమట్టానికి సంబంధించిన కుట్ర కోణం కేసుపై ప్రత్యేక కోర్టు ఈనెల 30న తీర్పు వెలువరించనుంది...

ఈనెల 30న బాబ్రీ కేసు తీర్పు

  • ఆడ్వాణీ, జోషి సహా నిందితులు హాజరు కావాలని ఆదేశం


లఖ్‌నవూ, సెప్టెంబరు 16: బాబ్రీ మసీదు నేలమట్టానికి సంబంధించిన కుట్ర కోణం కేసుపై ప్రత్యేక కోర్టు ఈనెల 30న తీర్పు వెలువరించనుంది. బీజేపీ సీనియర్‌ నేతలు లాల్‌ కృష్ణ ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమా భారతి, వినయ్‌ కటియార్‌, కల్యాణ్‌సింగ్‌, సాధ్వి రితంభర... మొదలైన 32 మంది ఈ కేసులో నిందితులు. తీర్పు రోజున నిందితులంతా కోర్టులోనే ఉండాలని జడ్జి ఎస్‌కే యాదవ్‌ ఆదేశించారు. దాదాపు 27 ఏళ్ల విచారణ తరువాత ఈ కేసు తీర్పు వెలువడనుంది. 

Updated Date - 2020-09-17T07:50:42+05:30 IST