భారత్‌లో కరోనా కేసులకు కారణం ఆ దేశమే

ABN , First Publish Date - 2020-03-28T23:14:43+05:30 IST

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచంలోని చాలా దేశాల్ని కబలించినప్పటికీ భారత్‌ను మాత్రం తాకలేకపోయింది. ఒకటో రెండో కేసులు భారత్‌లో కనిపించినప్పటికీ వాటితో పెద్దగా ప్రమాదం లేదనే చెప్పాలి. అయితే చూస్తున్నంతలోనే భారత్‌లో కూడా కరోనా

భారత్‌లో కరోనా కేసులకు కారణం ఆ దేశమే

న్యూఢిల్లీ: చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచంలోని చాలా దేశాల్ని కబలించినప్పటికీ భారత్‌ను మాత్రం తాకలేకపోయింది. ఒకటో రెండో కేసులు భారత్‌లో కనిపించినప్పటికీ వాటితో పెద్దగా ప్రమాదం లేదనే చెప్పాలి. అయితే చూస్తున్నంతలోనే భారత్‌లో కూడా కరోనా విజృంభిస్తోంది. అయితే ప్రపంచ దేశాల అనుభవాల్ని చూసిన మన పాలకులు భారత్‌లో ముందస్తు చర్యలకు దిగారు. 21 రోజుల పాటు దాదాపు దేశాన్ని లాక్‌డౌన్ చేశారు. అయితే ఈ కరోనా ఇండియాలోకి రావడానికి ప్రధాన కారణం దుబాయేనని ఒక అధ్యయనం పేర్కొంది. ఇండియాలో ఎక్కువ కేసులు దుబాయ్ నుంచి వచ్చిన వారేనని పేర్కొంది. అంతర్జాతీయ విమాన సర్వీసుల నిలివేతలో ఆలస్యం కావడం వల్లే ఇలా జరిగిందని ఆ అధ్యయనం తెలిపింది.


ప్రస్తుతం భారత్‌లో 873 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 20 మంది చనిపోయారు, 74 మంది కోలుకున్నారు. మొత్తం 873 కేసుల్లో 100 కేసులు దుబాయ్ నుంచి వచ్చిన వారేనని ఓ అధ్యయనం తెలిపింది. భారతీయులు ఎక్కువ సంఖ్యలో ఉండేది అక్కడేనని అని.. పైగా గల్ఫ్ దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడం దీనికి కారణమని సదరు అధ్యయనం పేర్కొంది.

Updated Date - 2020-03-28T23:14:43+05:30 IST