బెంగళూరులో 38 జోన్లుగా కరోనా హాట్‌స్పాట్స్ విభజన

ABN , First Publish Date - 2020-04-15T11:55:47+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో 38 జోన్ లుగా విభజించి కరోనా హాట్ స్పాట్లుగా ప్రభుత్వం ప్రకటించింది....

బెంగళూరులో 38 జోన్లుగా కరోనా హాట్‌స్పాట్స్ విభజన

ఏప్రిల్ 20 వరకు పోలీసుల నిషేధ ఆంక్షలు

బెంగళూరు (కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో 38 జోన్ లుగా విభజించి కరోనా హాట్ స్పాట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. బొమ్మనహళ్లి, మహాదేవపుర, బెంగళూరు ఈస్ట్, సౌత్, వెస్ట్, యలహంక ప్రాంతాల్లో కరోనా ప్రబలిన ప్రాంతాలను 38 జోన్లుగా విభజించి లాక్ డౌన్ ను అమలు చేస్తోంది. బెంగళూరు నగరంలో లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు వీలుగా ఏప్రిల్ 20వతేదీ వరకు సెక్షన్ 144 క్రిమినల్ ప్రొసిజర్ 1973 కింద నిషేధ ఆంక్షలు విధించామని నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావు ప్రకటించారు. నగరంలో నలుగురికంటే ఎక్కువ మంది ప్రజలు గుమిగూడవద్దని పోలీసు కమిషనర్ కోరారు. కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 258 చేరింది.కరోనాతో 9 మంది మరణించిన నేపథ్యంలో కర్ణాటక సర్కారు బెంగళూరు నగరంలో ఈ నిషేధ ఆంక్షలు విధించింది. 

Updated Date - 2020-04-15T11:55:47+05:30 IST