56 దేశాల పర్యాటకులకు ప్రయాణ పరిమితులను సడలించిన థాయిలాండ్
ABN , First Publish Date - 2020-12-18T01:06:20+05:30 IST
56 దేశాల పర్యాటకులకు ప్రయాణ పరిమితులను సడలించిన థాయిలాండ్
బ్యాంకాక్: దేశంలో కోవిడ్-19 నిబంధనలను సడలిస్తున్నట్లు థాయిలాండ్ ప్రభుత్వం పేర్కొంది. థాయిలాండ్‌లో కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని పెంచే ప్రయత్నంలో 56 దేశాల పౌరులకు ప్రయాణ పరిమితులను సడలించినట్లు థాయిలాండ్ సర్కారు పేర్కొంది.
ఫ్రాన్స్ మరియు యూఎస్ సహా పలు దేశాల పర్యాటకులు వీసాలు లేకుండా థాయిలాండ్ వెళ్ళవచ్చని, కాని వారు ప్రయాణానికి 72 గంటల ముందు కరోనా వైరస్ లేకుండా ఉన్నారని చూపించడానికి వారికి సర్టిఫికేట్ అవసరమని ప్రభుత్వం పేర్కొంది. తమ దేశానికి వచ్చే ఇతర దేశాల పర్యాటకులు తప్పనిసరిగా రెండు వారాలపాటు హోటల్ క్వారంటైన్‌లో ఉండాలని థాయిలాండ్ సర్కారు వెల్లడించింది.