28 రోజులుగా నో కరోనా.. ఆంక్షల సడలింపు దిశగా థాయ్‌ల్యాండ్
ABN , First Publish Date - 2020-06-23T05:20:40+05:30 IST
థ్యాయ్‌ల్యాండ్ దేశం కరోనాను అదుపు చేసినట్టే కినిపిస్తోంది. గత 28 రోజులుగా ఆ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

బ్యాంకాక్: థ్యాయ్‌ల్యాండ్ దేశం కరోనాను అదుపు చేసినట్టే కనిపిస్తోంది. గత 28 రోజులుగా ఆ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఆంక్షల సడలించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అక్కడి అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా స్తబ్దుగా ఉన్న ఆర్థిక రంగం తాజా నిర్ణయంతో జోరందుకునే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పర్యటక రంగానికి ఇది ఎంతో లాభం చేకూరుస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. దీనితో పాటూ మెడికల్ టూరిజం కూడా ఊపందుకుంటుందని చెబుతున్నారు. మరోవైపు.. ఎలాంటి సడలింపులు ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం నియమించిన టాస్క్ ఫోర్స్ ప్రస్తుతం కసరత్తు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు తొలగించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది.