టెక్సాస్‌లో కొవిడ్-19 కేసుల కొత్త రికార్డు..

ABN , First Publish Date - 2020-06-26T16:20:23+05:30 IST

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మరింత తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. గడచిన 24 గంటల్లో..

టెక్సాస్‌లో కొవిడ్-19 కేసుల కొత్త రికార్డు..

హూస్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మరింత తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. గడచిన 24 గంటల్లో ఏకంగా 6000 కొత్త కేసులు నమోదైనట్టు టెక్సాస్ ఆరోగ్య, మానవ సేవల విభాగం వెల్లడించింది. ఒకేరోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఈ వారంలో ఇది మూడోసారని అధికారులు పేర్కొన్నారు. గురువారం నాటికి టెక్సాస్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,31,917కి చేరుకుంది. కాగా మంగళవారం 5,551 మందికి,  బుధవారం 5,489 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు ఇక్కడ 74,496 కోలుకోగా... 2,296 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్-19 మహమ్మారి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో రాష్ట్రంలో తాత్కాలికంగా అన్ని ఆర్థిక కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు గవర్నర్ జార్జ్ అబ్బాట్ పేర్కొన్నారు.  

Updated Date - 2020-06-26T16:20:23+05:30 IST