స్వదేశీ టెస్టింగ్‌ స్వాబ్‌తో భారీగా తగ్గిన ధర

ABN , First Publish Date - 2020-05-18T07:47:24+05:30 IST

కరోనా పరీక్షలు చేసే క్రమంలో ముక్కు నుం చి స్రావాల సేకరణకు టెస్టింగ్‌ స్వాబ్‌లను వాడుతుంటారు. ఇవి చూడటానికి ఇయర్‌బడ్స్‌లా ఉంటాయి. భారత్‌కు చైనా ఎగుమతి చేసిన ఒక్కో టెస్టింగ్‌ స్వాబ్‌ ధర...

స్వదేశీ టెస్టింగ్‌ స్వాబ్‌తో భారీగా తగ్గిన ధర

న్యూఢిల్లీ, మే 17 : కరోనా పరీక్షలు చేసే క్రమంలో ముక్కు నుం చి స్రావాల సేకరణకు టెస్టింగ్‌ స్వాబ్‌లను వాడుతుంటారు. ఇవి చూడటానికి ఇయర్‌బడ్స్‌లా ఉంటాయి. భారత్‌కు చైనా ఎగుమతి చేసిన ఒక్కో టెస్టింగ్‌ స్వాబ్‌ ధర రూ.17. కేంద్ర ఔళిశాఖ చొరవతో ఇప్పుడు దీన్ని మన దేశంలోనే రూ.1.70కే తయారు చేసేందుకు రంగం సిద్ధమైంది.


పాలిస్టర్‌ ఉత్పత్తిలో ఖ్యాతి గడించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇయర్‌ బడ్‌ల తయారీలో పేరుగాంచిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంయుక్త భాగస్వామ్యంతో 10 రోజుల స్వల్ప వ్యవధిలోనే ఇది సాధ్యమైంది. ఇవి అభివృద్ధి చేసిన టెస్టింగ్‌ స్వాబ్‌ శాంపిల్‌ను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ) ఆమోదించడంతో వాణిజ్యపరంగా వాటి ఉత్పత్తికి మార్గం సుగమమైంది. ప్రస్తుతానికి రోజూ లక్ష టెస్టింగ్‌ స్వాబ్‌లను ఉత్పత్తి చేస్తుండగా, మరో 3వారాల్లో ఉత్పత్తి సామర్థ్యం రోజూ 6 లక్షలకు పెరుగుతుందని ప్రకటించారు. దీంతో భారత్‌ నుంచి విదేశాలకు టెస్టింగ్‌ స్వాబ్‌లను ఎగుమతి చేయొచ్చు. 


Updated Date - 2020-05-18T07:47:24+05:30 IST