కరోనా డ్యూటీలోని పోలీసులకు టెస్టులు చేయండి: ఐజీ

ABN , First Publish Date - 2020-05-10T05:05:44+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

కరోనా డ్యూటీలోని పోలీసులకు టెస్టులు  చేయండి: ఐజీ

పట్నా: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ క్రమంలో కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేయాలని బిహార్ ప్రభుత్వాన్ని పోలీసు శాఖ కోరింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శికి ఐజీ నయ్యర్ హస్నయిన్ ఖాన్ లేఖరాశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో డ్యూటీలు చేస్తున్న పోలీసు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని లేఖలో ఆయన కోరారు.

Updated Date - 2020-05-10T05:05:44+05:30 IST