కుల్గాంలో పోలీసులపై ఉగ్రవాద దాడి... ఓ వ్యక్తికి గాయాలు...

ABN , First Publish Date - 2020-06-04T22:44:00+05:30 IST

జమ్మూ-కశ్మీరులోని కుల్గాం జిల్లాలో గురువారం ఉగ్రవాద దాడి జరిగింది.

కుల్గాంలో పోలీసులపై ఉగ్రవాద దాడి... ఓ వ్యక్తికి గాయాలు...

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరులోని కుల్గాం జిల్లాలో గురువారం ఉగ్రవాద దాడి జరిగింది. దక్షిణ కశ్మీరులోని కుల్గాం ఏరియాలో యారిపొర మార్కెట్ సమీపంలో పోలీసు పార్టీపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఓ సాధారణ పౌరుడు గాయపడ్డారు. 


యారిపొర మార్కెట్ ఏరియాలో పోలీసు పార్టీ లక్ష్యంగా జరిగిన ఉగ్రవాద దాడిలో ఓ తూటా ఓ సాధారణ పౌరుని ఛాతీలోకి దూసుకెళ్ళింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. 


జమ్మూ-కశ్మీరు పోలీసు (కశ్మీరు రేంజ్) ఐజీ విజయ్ కుమార్ మాట్లాడుతూ, యారిపొర మార్కెట్ వద్ద పోలీసుల వాహనంపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు తెలిపారు. దీంతో పోలీసు దళాలు దీటుగా బదులిచ్చాయన్నారు. ఈ కాల్పుల్లో ఓ సాధారణ పౌరుడు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఉగ్రవాదుల కోసం గాలింపు జరుగుతున్నట్లు తెలిపారు.


ఆరోగ్య శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కాల్పుల్లో గాయపడిన వ్యక్తి పేరు ఇంతియాజ్ అహమద్. ఆయనకు ఛాతీలో తీవ్ర గాయమైంది. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఆయనను అనంత్‌నాగ్ ఆసుపత్రికి తరలించారు.
Updated Date - 2020-06-04T22:44:00+05:30 IST