కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం
ABN , First Publish Date - 2020-05-18T07:55:22+05:30 IST
కశ్మీర్‌లోని డొడా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్ ఉగ్రసంస్థ హిజ్‌బుల్ ముజాహిదీన్‌కి చావుదెబ్బ తగిలింది. ఆ సంస్థ కీలక ఉగ్రవాది, ఆర్‌ఎ్‌సఎస్ నేత హత్యలో ముఖ్య నిందితుడు తాహిర్ అహ్మద్ భట్‌ను...

డొడా, మే 17: కశ్మీర్‌లోని డొడా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్ ఉగ్రసంస్థ హిజ్‌బుల్ ముజాహిదీన్‌కి చావుదెబ్బ తగిలింది. ఆ సంస్థ కీలక ఉగ్రవాది, ఆర్‌ఎ్‌సఎస్ నేత హత్యలో ముఖ్య నిందితుడు తాహిర్ అహ్మద్ భట్‌ను భారత సైన్యం మట్టుబెట్టింది. స్థానిక గుండానా ప్రాంతంలోని పొస్తా-పొత్రా గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులు నక్కారన్న సమాచారంతో భద్రతాదళాలు ఆదివారం ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. అప్పుడు ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక జవాను అమరుడయ్యాడని అధికారు లు తెలిపారు. మూడేళ్లుగా డొడా జిల్లాలో తాహిర్ ఉగ్రకార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని, అతడి కోసం చాలాకాలంగా గాలిస్తున్నామని పేర్కొన్నారు.