అవన్నీ కాలుష్య హాట్‌స్పాట్లు.. ఇప్పుడు సీన్‌రివర్స్!

ABN , First Publish Date - 2020-04-27T03:23:02+05:30 IST

కరోనా వైరస్‌ను నియంత్రించడం కోసం విధించిన లాక్‌డౌన్ వల్ల పర్యావరణ కాలుష్యం బాగా తగ్గిపోతోంది.

అవన్నీ కాలుష్య హాట్‌స్పాట్లు.. ఇప్పుడు సీన్‌రివర్స్!

ఇంటర్నెట్ డెస్క్:  కరోనా వైరస్‌ను నియంత్రించడం కోసం విధించిన లాక్‌డౌన్ వల్ల పర్యావరణ కాలుష్యం బాగా తగ్గిపోతోంది. ఎంతలా అంటే దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబైల్లోని దాదాపు 10 కాలుష్య హాట్‌స్పాట్లు గ్రాన్‌జోన్లుగా మారిపోయేంతగా. ఈ వివరాలను సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్(ఎస్‌ఏఎఫ్‌ఏఆర్-సఫర్) సంస్థ ఆదివారం వెల్లడించింది. ఢిల్లీలోని వినోబాపురి, ఆదర్శ్‌ నగర్, వసుంధర, సాహిబాబాద్, ఆశ్రమ్ రోడ్, పంజాబ్ బాఘ్, ఓక్లా, బదార్‌పూర్ ప్రాంతాలు.. అలాగే ముంబైలోని వోర్లి, బోరివాలి, భందూప్ ప్రాంతాలు ఇకప్పడు పొల్యూషన్ హాట్‌స్పాట్లుగా ఉండేవి. అయితే లాక్‌డౌన్ పుణ్యమా అని ఇవన్నీ ప్రస్తుతం గ్రీన్‌జోన్లుగా మారిపోయాయి.

Updated Date - 2020-04-27T03:23:02+05:30 IST