ఆలయాల్లో భక్తులను అనుమతించండి

ABN , First Publish Date - 2020-05-13T12:34:33+05:30 IST

ఆలయాల్లో భక్తులను అనుమతించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఆలయాల్లో భక్తులను అనుమతించండి

చెన్నై: ఆలయాల్లో భక్తులను అనుమతించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో... లాక్‌డౌన్‌ను దశల వారీగా తగ్గించి సాధారణ జీవితం, ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడేలా చర్యలు చేపట్టిన కేంద్రప్రభుత్వం 34 రకాల దుకాణాలు తెరచేందుకు అనుమతులివ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఇన్నాళ్లు కరోనా భయంతో ప్రజలు మానసికంగా ఇబ్బందులు పడడంతో పాటు ఆత్మస్థైర్యం కోల్పోయిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రజలు వీటి నుంచి అధిగమించాలంటే ఆధ్యాత్మికసేవ ప్రధానమన్నారు. ఇందుకోసం ఆలయాలను తెరచి భక్తులను అను మతించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. లాక్‌డౌన్‌ నుంచి పలురకాల దుకాణాలకు మినహాయింపు ఇచ్చిన విధంగా ఈ దుకాణాలను కూడా తెరచేందుకు అనుమతించాలన్నారు. 

Read more