ఆలయాల మూసివేతతో ఖజానాకు భారీ దెబ్బ
ABN , First Publish Date - 2020-04-29T03:26:41+05:30 IST
నెల రోజులకు పైగా కొవిడ్-19 లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో కర్నాటక పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది...

మైసూరు: నెల రోజులకు పైగా కొవిడ్-19 లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో కర్నాటక పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. దీంతోపాటు ఆలయాల మూసివేత కారణంగా రాష్ట్ర ఖజానాకు గట్టి దెబ్బ తగిలింది. కర్నాటకలో ఏప్రిల్-మే నెలల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం రెండు వందలకు పైగా ‘ఏ’ గ్రేడ్ ఆలయాలు ఉండగా... ఇందులో 40-50 ఆలయాల్లో నెలకు రూ.3-6 కోట్ల ఆదాయం వస్తుంది.
కరోనా మహమ్మారి కారణంగా ఆలయాలను మూసివేయడంతో.. అధికారులు, పురోహితులు రోజుకు రెండు సార్లు పూజలు నిర్వహిస్తున్నారు. కాగా ఆలయాల మూసివేత కారణంగా ప్రభుత్వానికి రూ.150 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు దేవదాయ శాఖ మంత్రి శ్రీనివాస పూజారి పేర్కొన్నారు. లాక్‌డౌన్ మరిన్ని రోజులు కొనసాగే పక్షంలో తాము ఆన్‌లైన్ సేవలు ప్రారంభించే యోచనలో ఉన్నట్టు ఆయన తెలిపారు.