రాజస్థాన్‌లోని చురులో చురుక్కుమంటున్న ఎండలు

ABN , First Publish Date - 2020-05-24T21:38:37+05:30 IST

రాజస్థాన్‌లోని చురులో ఈ ఆదివారం భానుడు తన ప్రతాపాన్ని తీవ్రంగా

రాజస్థాన్‌లోని చురులో చురుక్కుమంటున్న ఎండలు

న్యూఢి్ల్లీ : రాజస్థాన్‌లోని చురులో ఈ ఆదివారం భానుడు తన ప్రతాపాన్ని తీవ్రంగా చూపించబోతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ కాలంలో నవతాప దినాల్లో ఈ ఆదివారం ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చునని తెలిపింది. చురులో చలికాలంలో మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రత నమోదవుతుంది, వేసవి కాలంలో దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది.


దేశవ్యాప్త అష్ట దిగ్బంధనంలో సడలింపులు ఇచ్చినప్పటికీ ఎప్పుడూ రద్దీగా ఉండే ధర్మస్థూపం ప్రాంతం నిర్మానుష్యంగా కనిపించింది. ప్రజలు మండుటెండలకు తాళలేక ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. మధ్యాహ్నం వేళ వడగాలి తీవ్రంగా ఉండటంతో ప్రజలు వీథుల్లోకి రావడానికి ఇష్టపడలేదు. 


బికనీర్‌లో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు టోపీలు, చేతులకు తొడుగులు ధరించారు. 


రాజస్థాన్‌లోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 46 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉండవచ్చునని తెలిపింది. 


Updated Date - 2020-05-24T21:38:37+05:30 IST