క్రౌడ్ ఫండింగ్‌లో తెలుగు రాష్ట్రాలు భేష్‌!.. మిలాప్ సీఈవో మయూఖ్ చౌదరి

ABN , First Publish Date - 2020-09-25T01:33:11+05:30 IST

శ్యామ్‌ ప్రసాద్‌ సొంత రెస్టారెంట్‌ను తెరువాలనే తన కలను సాకారం చేసుకున్నారు, కానీ ఆయన తమ నవజాత కుమార్తె పరిస్థితి చూసిన తరువాత కుప్పకూలిపోయారు. పుట్టిన నెలరోజులకే, ఆయుషీ హృదయంలో రంధ్రాలు ఉన్నాయని...

క్రౌడ్ ఫండింగ్‌లో తెలుగు రాష్ట్రాలు భేష్‌!.. మిలాప్ సీఈవో మయూఖ్ చౌదరి

శ్యామ్‌ ప్రసాద్‌ సొంత రెస్టారెంట్‌ను తెరువాలనే తన కలను సాకారం చేసుకున్నారు, కానీ ఆయన తమ నవజాత కుమార్తె  పరిస్థితి చూసిన తరువాత కుప్పకూలిపోయారు. పుట్టిన నెలరోజులకే, ఆయుషీ  హృదయంలో రంధ్రాలు ఉన్నాయని గుర్తించడంతో పాటుగా ఆమె శ్వాస వ్యవస్థలో లోపాలున్నాయని గుర్తించారు. ఆమెకు పలుమార్లు శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరం ఉంది. తన కుమార్తె జీవితం ప్రమాదంలో పడటంతో, మరో ఆలోచన లేకుండా ఆయన తన రెస్టారెంట్‌ను అమ్మేశారు. ఆయన ఎలాగోలా చేసి గుండె ఆపరేషన్‌ను స్నేహితులు, కుటుంబసభ్యుల సహకారంతో చేయించారు.. కానీ ఈ చికిత్స మధ్యలోనే ఆయన తన దగ్గర ఉన్న మార్గాలు మూసుకు పోయాయి. దీంతో దక్షిణాసియాలో అతిపెద్ద క్రౌడ్‌ ఫండింగ్‌ వేదిక మిలాప్‌పై క్రౌడ్‌ ఫండింగ్‌ క్యాంపెయిన్‌ ప్రారంభించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది మానవత్వంతో ఆయనకు సాయం చేశారు. దీంతో 7.9 లక్షల రూపాయలను శస్త్రచికిత్స కోసం సమీకరించగలిగారు. ఒక్క శ్యామ్‌ ప్రసాద్‌ మాత్రమే కాదు.. ఆయనలాంటి మరెంతో మందికి మిలాప్‌ క్రౌడ్‌ ఫండింగ్‌ సాయం అందించింది.


సంవత్సరాల తరబడి పొదుపును వైద్య అత్యవసరాలు రోజులలోనే మింగేస్తాయి. కొన్నిసార్లు అది కూడా సరిపోదు. కానీ ప్రతి ఒక్కరూ తమ ఆప్తులను కాపాడుకునేందుకు అవిశ్రాంతంగా ప్రయత్నిస్తుంటారు. అందుకోసం అనేక మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో మిలాప్‌ లాంటి వేదికలు వారికి కొండంత అండగా నిలుస్తుంటాయి. దీనిపై మిలాప్‌ సీఈవో అండ్‌ కో–ఫౌండర్‌ మయూఖ్‌ చౌదరి మాట్లాడుతూ, మిలాప్‌ తరపున తమకోసమే కాదు.. ఇతరుల కోసం కూడా క్రౌడ్‌ ఫండింగ్‌ చేసేవారు అనేకమంది ఉన్నారని మయూఖ్‌ తెలిపారు. వలస కార్మికులకు సహాయం చేయడానికి, వేధింపుల బాధితులకు మిలాప్‌ ఎంతో తోడ్పాటునందించింది. చివరకు వీధి శునకాలకు సహాయపడటానికి కూడా ఉపయోగపడింది. ఇప్పుడు మరింత మంది ప్రజలు ఒకరికొకరు సహాయపడటానికి డిజిటల్‌ మార్గం ఎంచుకుంటున్నారు. ఇందులో చిన్నారులు కూడా పాల్గొంటుండడం మిలాప్‌ గొప్పతనానికి ప్రతీకగా చెప్పవచ్చని మయుఖ్‌ అన్నారు. 17 సంవత్సరాల వయసు కలిగిన స్మృతి, 14 సంవత్సరాల మిషిక, అన్విత.. 11 సంవత్సరాల రిధి వంటి వారు డిజిటల్‌ ప్రపంచం వినియోగించుకుని వలస కార్మికులకు భోజన సౌకర్యాలు కల్పించడం, బాలికల విద్యకు సహాయపడటం, వీధి శునకాలకు మేత, సౌర విద్యుత్‌ పట్ల అవగాహన కల్పించడం ఆనందదాయకమని పేర్కొన్నారు.

Updated Date - 2020-09-25T01:33:11+05:30 IST