నామినేషన్‌కు ముందు తల్లి ఆశీర్వాదం తీసుకున్న తేజస్వీ

ABN , First Publish Date - 2020-10-14T17:07:22+05:30 IST

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు రెండవ దశ నామినేషన్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ-కాంగ్రెస్-వామపక్ష పార్టీలు కలిసి మహాగట్‌బంధన్‌గా పోటీకి దిగుతున్నాయి. నితీష్ నేతృత్వంలోని ఎన్డీయే ఒకవైపు

నామినేషన్‌కు ముందు తల్లి ఆశీర్వాదం తీసుకున్న తేజస్వీ

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్జేడీ పార్టీ కీలక నేత, ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ తల్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆయన రాఘోపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా నామినేషన్‌ వేయడానికి ముందు తల్లి రబ్రీదేవి, అన్నయ్య తేజ్ ప్రతాప్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇదే సందర్భంలో మీడియా ముందే తల్లి, అన్నయ్యల పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. రబ్రీదేవి చేతిలో ఉన్న తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఫొటోకు కూడా నమస్కరించారు.


రబ్రీ దేవి మీడియాతో మాట్లాడుతూ.. లాలూ ప్రసాద్ యాదవ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. బిహార్ ప్రజలు లాలూను మిస్సవుతున్నారని గుర్తు చేశారు. అయినప్పటికీ తాము ఎంతో గుండె నిబ్బరంతో ఎన్నికలకు వెళ్తున్నామని, బిహార్ ప్రజల తీర్పు తమకు అనుకూలంగా ఉంటదని విశ్వాసం వ్యక్తం చేశారు.


బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు రెండవ దశ నామినేషన్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ-కాంగ్రెస్-వామపక్ష పార్టీలు కలిసి మహాగట్‌బంధన్‌గా పోటీకి దిగుతున్నాయి. నితీష్ నేతృత్వంలోని ఎన్డీయే ఒకవైపు, తేజస్వీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మహాగట్‌బంధన్‌ మరోవైపు బిహార్ ఎన్నికల్లో పోటాపోటీగా తలపడనున్నట్లు రాజకీయ విశ్లేషనలు వెలువడుతున్నాయి.

Updated Date - 2020-10-14T17:07:22+05:30 IST