జంగిల్ రాజ్‌కు రాకుమారుడు తేజస్వీ: మోదీ సెటైర్లు
ABN , First Publish Date - 2020-10-28T21:04:12+05:30 IST
బిహార్ అసెంబ్లీకి ఈరోజు తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 71 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 3 గంటల వరకు

పాట్నా: మహాగట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ విరుచుకుపడ్డారు. తేజస్వీని జంగిల్ రాజ్‌కు రాకుమారుడని మోదీ దుయ్యబట్టారు. బిహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్‌పై పదునైన వ్యాఖ్యలతో దాడి చేశారు.
‘‘తేజస్వీ యాదవ్ బిహార్‌కు కాబోయే యువరాజు కాదు, జంగిల్ రాజ్‌కు రాకుమారుడు. కిడ్నాప్‌ల్లో వారి కుటుంబానికి కాపీరైట్లు ఉన్నాయి. మహాగట్‌బంధన్‌ను గెలిపిస్తే మళ్లీ ఆ జంగిల్ రాజ్ వస్తుంది. బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాకే మార్పు వచ్చింది. నితీష్ ప్రభుత్వం బిహార్‌ను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దింది. బిహారీల ఆశలను, ఆశయాలను నెరవేర్చేది ఎన్డీయే మాత్రమే’’ అని మోదీ అన్నారు.
బిహార్ అసెంబ్లీకి ఈరోజు తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 71 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 3 గంటల వరకు 44.10 శాతం ఓటింగ్ నమోదైంది. ఒకటి రెండు చెదురు ముదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు ఈసీ పేర్కొంది.