తేజస్వీ విమర్శకుల నోళ్లు 10న మూతపడతాయి: శత్రుఘన్ సిన్హా

ABN , First Publish Date - 2020-11-04T00:19:00+05:30 IST

శత్రుఘన్ సిన్హా కుమారుడు లవ్ సిన్హా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. లవ్ సిన్హా పోటీ చేసిన బంకిపూర్ నియోజకవర్గానికి రెండవ విడత పోలింగ్‌లో భాగంగా ఈరోజు పోలింగ్ జరిగింది. దాదాపు రెండు దశాబ్దాల అనంతరం 2019

తేజస్వీ విమర్శకుల నోళ్లు 10న మూతపడతాయి: శత్రుఘన్ సిన్హా

పాట్నా: మహాగట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై విమర్శలు చేస్తున్న వారి నోళ్లు నవంబర్ 10వ తేదీని మూతపడతాయని కాంగ్రెస్ నేత శత్రుఘన్ సిన్హా అన్నారు. ఫలితాల్లో మహాగట్‌బంధన్ ఘన విజయం సాధించి తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు. 10 లక్షల ఉద్యోగాల కల్పనపై యువతలో విశ్వాసం ఉందని, అది ఎన్నికల ఫలితాల అనంతరం ఆనందోత్సాహాల రూపంలో వెల్లడవుతుందని సిన్హా అన్నారు.


‘‘కొంత మంది తేజస్వీపై అనుచిత పదజాలంతో దాడి చేస్తున్నారు. ఇలాంటి పదాలు ఎవరినైనా తీవ్ర అసంతృప్తి పరుస్తాయి. వీళ్లు బిహార్ సమస్యల గురించి ఒక్కమాటైనా మాట్లాడటం లేదు. చైనా, ఆర్టికల్ 370, త్రిపుల్ తలాక్ లాంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు. కానీ తేజస్వీ అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, ఉద్యోగ కల్పన, రైతు సమస్యల గురించి మాట్లాడుతున్నారు. రెండు వర్గాల ప్రసంగాల మధ్య చాలా తేడా ఉంది. ఈ తేడాను బిహార్ ప్రజలు కూడా పసిగట్టారు. 10 లక్షల ఉద్యోగ కల్పనపై తేజస్వీ ఇచ్చి తీరుతారని యువతలో విశ్వాసం ఉంది. తేజస్వీపై విమర్శకుల నోళ్లు ఫలితాల అనంతరం మూతపడతాయి’’ అని శత్రుఘన్ సిన్హా అన్నారు.


శత్రుఘన్ సిన్హా కుమారుడు లవ్ సిన్హా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. లవ్ సిన్హా పోటీ చేసిన బంకిపూర్ నియోజకవర్గానికి రెండవ విడత పోలింగ్‌లో భాగంగా ఈరోజు పోలింగ్ జరిగింది. దాదాపు రెండు దశాబ్దాల అనంతరం 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు శత్రుఘన్ సిన్హా. అనంతరం, ఆయన సొంత నియోజకవర్గం పాట్నా సాహిబ్‌లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌పై ఓడిపోయారు.

Updated Date - 2020-11-04T00:19:00+05:30 IST