17 నుంచి తేజస్ ఎక్స్‌ప్రెస్ పరుగులు... రేపటి నుంచి టిక్కెట్ల బుకింగ్!
ABN , First Publish Date - 2020-10-07T14:26:13+05:30 IST
దేశంలో కార్పొరేట్ సెక్టార్‌కు చెందిన తొలి రైలు తేజస్ ఎక్స్ ప్రెస్ ఈ నెల 17 నుంచి పరుగులు పెట్టనుంది. ఐఆర్సీటీసీ ఈ వీఐపీ రైలుకు సంబంధించిన రిజర్వేషన్ బుకింగ్‌ను...

న్యూఢిల్లీ: దేశంలో కార్పొరేట్ సెక్టార్‌కు చెందిన తొలి రైలు తేజస్ ఎక్స్ ప్రెస్ ఈ నెల 17 నుంచి పరుగులు పెట్టనుంది. ఐఆర్సీటీసీ ఈ వీఐపీ రైలుకు సంబంధించిన రిజర్వేషన్ బుకింగ్‌ను ఈనెల 8 వ తేదీ నుంచి ప్రారంభించనుంది. ప్రయాణీకులకు రైలులో ప్యాక్డ్ ఫుడ్ అందించనున్నారు. ఐఆర్సీటీసీ, రైల్వేబోర్టు అధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సుమారు ఏడాది క్రితం లక్నో- న్యూఢిల్లీ మధ్య కార్పొరేట్ సెక్టార్‌కు చెందిన తొలి రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. తరువాత అహ్మదాబాద్-ముంబై మధ్య కూడా ఇదే తరహా రైలును ప్రారంభించారు. ఆధునిక సదుపాయాలు కలిగిన ఈ రైళ్లు ప్రయాణికుల ఆదరణకు నోచుకున్నాయి. ఈ రైళ్ల రాకలో జాప్యం జరిగితే ప్రయాణికులకు వారి టిక్కెట్ డబ్బులు తిరిగి చెల్లిస్తారు.