తేజస్వీని పూలతో స్వాగతించిన తేజ్... ఫొటో వైరల్!
ABN , First Publish Date - 2020-10-14T14:36:04+05:30 IST
బీహార్ ఎన్నికల రెండవ దశ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. హసన్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన తేజస్వీ యాదవ్ తన సోదరుని నామినేషన్...

పట్నా: బీహార్ ఎన్నికల రెండవ దశ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. హసన్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన తేజస్వీ యాదవ్ తన సోదరుని నామినేషన్ కోసం హెలికాప్టర్‌లో రోసడా కు వచ్చారు. హెలీప్యాడ్ వద్ద తేజ్‌ప్రతాప్ పూల గుత్తితో తన సోదరుణ్ణి స్వాగతించారు. రొసేరాలోని ఎస్డీవో కార్యాలయంలో తన సోదరుని నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత తేజస్వీ యాదవ్ సీఎం నితీష్ కుమార్‌పై నిప్పులు చెరిగారు. లాక్‌డౌన్ సమయంలో కూలీలను బీహార్‌లోకి రానివ్వకుండా ఎలా చేశారో, ఇప్పుడు కూడా బీహార్ ప్రజలను అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంచుతున్నారని ఆరోపించారు.
నాలుగేళ్లలో నాలుగు ప్రభుత్వాలు ఏర్పడినా, ఏమాత్రం అభివృద్ధి జరగలేదన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఎటువంటి నీతినియమాలు, సిద్ధాంతాలు లేవన్నారు. కుర్చీపై వ్యామోహంతో బీహార్ ప్రజల తీర్పును అవమానపరుస్తున్నారని ఆరోపించారు. బీహార్‌లో త్వరలో తమ ప్రభుత్వం ఏర్పడబోతున్నదని, నవంబరు 10 ఎన్నికల ఫలితాలు రానున్నాయని, తొలి క్యాబినెట్ మీటింగ్ తామే ఏర్పాటు చేయనున్నామన్నారు. 10 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నామని అన్నారు. సోదరుడు తేజ్ ప్రతాప్ నామినేషన్ దాఖలు చేశారని, తమకు హసన్‌పూర్ ప్రజలపై పూర్తినమ్మకం ఉందని అన్నారు. వారు తేజ్ ప్రతాప్‌కు ఎన్నికల్లో అఖండ విజయం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.