సీఎం ఇంటి సమీపంలోని చాయివాలాకు కరోనా...అధికారులు అప్రమత్తం

ABN , First Publish Date - 2020-04-07T17:51:05+05:30 IST

మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నివాసమైన మాతోశ్రీకి సమీపంలోని ఒక టీ దుకాణదారునికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీనితో మాతోశ్రీకి సీలు వేశారు.

సీఎం ఇంటి సమీపంలోని చాయివాలాకు కరోనా...అధికారులు అప్రమత్తం

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నివాసమైన మాతోశ్రీకి  సమీపంలోని ఒక  టీ దుకాణదారునికి  కరోనా పాజిటివ్ గా తేలింది. దీనితో మాతోశ్రీకి  సీలు వేశారు. అలాగే రెండు ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన  39 మందిలో కరోనా ఇన్ఫెక్షన్ కనిపించిన నేపథ్యంలో ఆ ఆసుపత్రులను మూసివేశారు. ఇదిలావుండగా మహారాష్ట్రలో రోగుల సంఖ్య 868 కు చేరింది. బీఎంసీ అధికారి ఒకరు మాట్లాడుతూ ముందుజాగ్రత్త చర్యగా మాతోశ్రీకి  సీలు వేశాం. ఈ ప్రాంతం వైరస్ సంక్రమణ రహితంగా ఉండటానికి మందులు పిచికారీ చేశాం. తాజాగా  ఆ టీ దుకాణదారుడితో పరిచయం ఉన్న వ్యక్తులను  గుర్తించామన్నారు. 

Updated Date - 2020-04-07T17:51:05+05:30 IST