'రోజుకో వేషం' మార్చే ప్రధాని ఆయనొక్కరే...!
ABN , First Publish Date - 2020-11-16T01:54:59+05:30 IST
ప్రధాని నరేంద్ర మోదీని 'ఇంపోస్టర్ పీఎం' (వేషాలు మార్చే ప్రధాని) అంటూ కాంగ్రెస్ నేత

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని 'ఇంపోస్టర్ పీఎం' (వేషాలు మార్చే ప్రధాని) అంటూ కాంగ్రెస్ నేత తారిఖ్ అన్వర్ వ్యాఖ్యానించారు. సందర్భాన్ని బట్టి ఆయన వేషాలు మారుస్తుంటారంటూ విసుర్లు విసిరారు. ప్రధాని మోదీ ఆర్మీ యూనిఫాం ధరించి జైసల్మేర్‌లో సైనికులను కలిసిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ ట్విట్టర్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
'ఈ దేశం చాలా మంది ప్రధానులనే చూసింది. కానీ ఎప్పటికప్పుడు వేషాలు మార్చే ప్రధానిని మాత్రం మొదటి సారి చూస్తోంది. సందర్భాన్ని బట్టి ఆయన గెటప్‌లు మారుస్తుంటారు. కొన్ని సార్లు ఛాయ్‌వాలాలా, మరికొన్ని సార్లు 10 లక్షల సూటుతో, ఇంకొన్ని సార్లు వాచ్‌మన్‌గా, ప్రధాన్ సేవక్ చీఫ్‌గా, సాధువుగా, సైనికుడిగా ఇలా చాలా గెటప్‌లలో కనిపిస్తుంటారు' అని తారిఖ్ అన్వర్ ఆ ట్వీట్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.