తమిళనాడులో తగ్గని కరోనా.. ఒక్కరోజులో 1300పైగా కేసులు

ABN , First Publish Date - 2020-06-05T01:10:09+05:30 IST

తమిళనాడులో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ...

తమిళనాడులో తగ్గని కరోనా.. ఒక్కరోజులో 1300పైగా కేసులు

చెన్నై: తమిళనాడులో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ వారికంటే రెండింతలు కేసులు ప్రతి రోజూ నమోదవుతున్నాయి. దీనికి తోడు నాలుగు రోజులుగా వరుసగా వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ రోజు ఏకంగా 1300కు పైగా కోవిడ్-19 కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొత్తగా నమోదైన కేసులకు సంబంధించి ప్రభుత్వం ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,373 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 మంది మృత్యువాత పడ్డారు. 585 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.


తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 27,256కు చేరింది. వీరిలో 14,901 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 12,132 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా కారణంగా ఇప్పటివరకు 220 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది.

Updated Date - 2020-06-05T01:10:09+05:30 IST