తమిళనాడులో మంత్రికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-06-20T00:20:08+05:30 IST

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి...

తమిళనాడులో మంత్రికి కరోనా పాజిటివ్

చెన్నై: తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కేపీ అన్బళగన్ కరోనా బారిన పడ్డారు. దీంతో.. ఆయనను మణపక్కంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మంత్రి బుధవారం ఆసుపత్రికి వెళ్లారు. సిటీ స్కాన్ చేయించుకున్నారు. అనంతరం.. కోవిడ్-19 నిర్ధారిత పరీక్షలు చేయించుకున్నారు. ఈ టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది.


తమిళనాడులో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో కట్టడి చర్యలకు సంబంధించిన అంశాలపై మంత్రి కూడా పలు సమీక్షా నిర్వహించినట్లు తెలిసింది. దీంతో.. ఈ సమావేశాలకు హాజరయిన వారందరికీ ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది. సీనియర్ స్థాయి అధికారులైన హెల్త్ సెక్రటరీ జే.రాధాకృష్ణన్, చెన్నై కార్పొరేషన్ కమిషనర్ ప్రకాష్, సిటీ పోలీస్ కమిషనర్ ఏకే విశ్వనాథన్, పలువురు ఐఏఎస్ అధికారులు మంత్రి నిర్వహించిన సమావేశాల్లో పాల్గొనట్టు తెలిసింది.

Updated Date - 2020-06-20T00:20:08+05:30 IST