తమిళనాడులో అతి భారీ వర్షాలు
ABN , First Publish Date - 2020-11-25T13:11:20+05:30 IST
తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుకొట్టై, తంజావురు, తిరువరూర్, నాగపట్నంలో భారీగా వర్షాలు పడుతున్నాయి.

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుకొట్టై, తంజావురు, తిరువరూర్, నాగపట్నంలో భారీగా వర్షాలు పడుతున్నాయి. అలాగే అటు విల్లుపురం, తిరువణ్ణామలై, చెంగల్‌పట్టులోనూ అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి సీఎంలతో మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. దాదాపు 13 రైళ్లను రైల్వేశాఖ దారి మళ్లించగా...24 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. తుఫాన్ కారణంగా చెన్నై లోకల్ రైళ్లు మొత్తం రద్దు అయ్యాయి. 7 జిల్లాల్లో రవాణా వ్యవస్థను తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది.