రేపటి నుంచి షరతులతో దుకాణాలు తెరవడానికి అనుమతినిచ్చిన తమిళనాడు
ABN , First Publish Date - 2020-04-25T23:42:25+05:30 IST
గుజరాత్ లో ఆదివారం నుంచి దుకాణాలు తెరుచుకోనున్నాయి. అయితే కంటైయిన్‌మెంట్ జోన్లలో ఉన్న దుకాణాలు మాత్రం తెరవడానికి

చెన్నై : గుజరాత్ లో ఆదివారం నుంచి దుకాణాలు తెరుచుకోనున్నాయి. అయితే కంటైయిన్‌మెంట్ జోన్లలో ఉన్న దుకాణాలు మాత్రం తెరవడానికి వీల్లేదని అధికారులు తేల్చి చెప్పారు. కంటైయిన్‌మెంట్ జోన్లలో లేని ఐటీ సంస్థలు కూడా 50 శాతం మందితో విధులు నిర్వర్తించుకోవచ్చని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ‘‘ కంటెయిన్‌మెంట్ జోన్ల పరిధిలో లేని అన్ని దుకాణాలను రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి తెరుచుకోవచ్చు. కంటెయిన్‌మెంట్ జోన్ల పరిధిలో ఉన్న దుకాణాలు మాత్రం తెరవవద్దు’’ అని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి అశ్వనీ కుమార్ ప్రకటించారు. అయితే ఆయా దుకాణాల యజమానులు, పనిచేసే సిబ్బంది కచ్చితంగా మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరాన్ని పాటించాల్సిందేనని అశ్వనీ కుమార్ తెలిపారు.