మే 31 వరకూ లాక్‌డౌన్ పొడిగించిన తమిళనాడు

ABN , First Publish Date - 2020-05-17T20:55:36+05:30 IST

కరోనా వైరస్ బాధిత రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న తమిళనాడు సైతం లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను ఈ నెల 31వ తేదీ వరకూ..

మే 31 వరకూ లాక్‌డౌన్ పొడిగించిన తమిళనాడు

చెన్నై: కరోనా వైరస్ బాధిత రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న తమిళనాడు సైతం లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను ఈ నెల 31వ తేదీ వరకూ పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారంతో మూడో విడత లాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. దీనికి కొద్ది సేపటికి ముందే మహారాష్ట్ర సర్కార్ సైతం లాక్‌డౌన్‌ను ఈనెల 31 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్త ఆర్థిక ప్యాకేజ్ కాకుండా ముంబైకి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కూడా ఉద్ధవ్ థాకరే సర్కార్ డిమాండ్ చేస్తోంది.


కాగా, దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య అదివారంనాటికి 90,927కు చేరింది. 34,109 మంది కోలుకోగా, 2,872 మరణాలు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 1,135 మరణాలు సంభవించగా, గుజరాత్‌లో 625, డిల్లీలో 129, రాజస్థాన్‌లో 126, తమిళనాడులో 74 మరణాలు చోటుచేసుకున్నాయి.

Updated Date - 2020-05-17T20:55:36+05:30 IST