తమిళనాట 600 కొత్త కేసులు
ABN , First Publish Date - 2020-05-09T08:51:03+05:30 IST
తమిళనాడులో శుక్రవారం 13,833 మందికి పరీక్షలు చేయగా, 600 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. వీరిలో 399 మంది చెన్నైకి చెందినవారే. దీంతో రాష్ట్రంలో మొత్తం
చెన్నై, మే 8 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో శుక్రవారం 13,833 మందికి పరీక్షలు చేయగా, 600 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. వీరిలో 399 మంది చెన్నైకి చెందినవారే. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 6009కి, చెన్నైలో 3043కి చేరుకుంది. శుక్రవారం చెన్నైలో ఇద్దరు, తిరునల్వేలిలో ఒకరు కరోనాతో బాధపడుతూ మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 40కి చేరుకుంది. దేశంలోనే అత్యధికంగా తమిళనాడులో కరోనా పరీక్షలు నిర్వహించామని, మరణాల రేటు కూడా రాష్ట్రంలోనే అత్యంత తక్కువగా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి.విజయభాస్కర్ తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చినవారిలో 80 శాతం మందికి ఎటువంటి లక్షణాలు లేవని, ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పాజిటివ్ ఉన్నా ఎటువంటి లక్షణాలు, ఇతరత్రా వ్యాధులు కూడా లేకుండా ఆరోగ్యంగా ఉన్నవారిని వైద్యుల సూచనల మేరకు ఇంటికి పంపిస్తున్నామని చెప్పారు.