నేటి నుంచి మద్యం విక్రయాలు

ABN , First Publish Date - 2020-08-18T12:40:10+05:30 IST

నేటి నుంచి మద్యం విక్రయాలు

నేటి నుంచి మద్యం విక్రయాలు

140 రోజుల తర్వాత కొత్త సరకుతో

చెన్నైలో టాస్మాక్‌ దుకాణాలు


చెన్నై, (ఆంధ్రజ్యోతి) : రాజధాని నగరం చెన్నైలో 140 రోజుల తర్వాత కొత్త సరకుతో టాస్మాక్‌ మద్యం దుకాణాలు మంగళవారం నుంచి తెరచుకోనున్నాయి. కరోనా కారణంగా నగరంలో పాజటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరగటంతో ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేసింది. అదే సమయంలో చెన్నై పోలీసు సర్కిల్‌ పరిధిలోని ప్రాంతాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మే ఏడో తేదీ నుంచి మద్యం దుకాణాలను తెరి చారు. ప్రస్తుతం చెన్నై నగరంలో కరోనా వైరస్‌ వ్యాప్తి మూడు నాలుగు జోన్లలోనే ఉండటంతో మంగళవారం నుంచి మద్యం దుకాణాలు తెరిచేం దుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు చెందిన ప్రాంతాలతో కూడిన గ్రేటర్‌ చెన్నై పోలీసు సర్కిల్‌ పరిధి లో 900ల మద్యం దుకాణాలున్నాయి. వీటిలో కాంచీపురం, తిరువళ్ళూరులో 180 మద్యం దుకాణాలు పనిచేస్తున్నాయి.


చెన్నైలో తక్కిన 720 దుకాణాలు మాత్రమే 140 రోజులుగా మూతపడ్డాయి. ఈ దుకాణాలన్నీ మంగళవారం ఉదయం పది గంటల నుంచి తెరుచుకోనున్నాయి. ప్రతి మధ్యం దుకాణంలో రోజుకు 500 టోకెన్లు మాత్రమే ఇచ్చి మద్యం విక్రయిస్తామని, ఉదయం పది గంటలనుండి సాయంత్రం ఏడువరకు దుకాణాలు తెరచి వుంటాయని టాస్మాక్‌ అధికారులు వెల్లడించారు. నాలుగు నెలలకు పైగా నగర పరిధిలో మూతపడిన మద్యం దుకాణాల్లో నిల్వచేసిన మద్యం కాలపరిమితి ముగి యటంతో వాటిని వారం రోజుల క్రితమే టాస్కాక్‌ అధికారులు తొలగించారు. కొత్త స్టాకును సోమవారం రాత్రిలోగా నగర పరిధిలో ఉన్న 720 దుకాణాలకు తరలించనున్నారు. నాలుగున్నర నెలల తర్వాత మద్యం దుకాణాలు తెరుచు కోనుండటం తో మంగళవారం ఆ దుకాణాల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడు తుందని భావించిన టాస్మాక్‌ అధికారులు దుకాణాల వద్ద కొయ్యలతో క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే జనాన్ని అదుపు చేసేందుకు ప్రతి దుకాణం వద్ద పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయనున్నామని టాస్మాక్‌ అధికారులు తెలిపారు.


మద్యం దుకాణాలు మాత్రమే మంగళవారం నుంచి పనిచేస్తాయని, బార్లకు ప్రభుత్వం అనుమతివ్వలేదని పేర్కొన్నారు. చెన్నై నగరమంతటా మద్యం దుకాణాలు మళ్ళీ ప్రారంభం కానుండటంతో ఇప్పటి వరకు కాంచీపురం, తిరువళ్ళూరు జిల్లాల్లో పెరిగిన మద్యం అమ్మకాలు బాగా తగ్గనున్నాయి. ఇదిలా ఉండగా వేతనాల పెంపు సహా 14 డిమాండ్లతో టాస్మాక్‌ ఉద్యోగులు సోమవారం ధర్నా నిర్వహించారు. 

Updated Date - 2020-08-18T12:40:10+05:30 IST