నేడు ఎడప్పాడి ప్రచారం ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-19T14:32:18+05:30 IST
నేడు ఎడప్పాడి ప్రచారం ప్రారంభం

చెన్నై,(ఆంధ్రజ్యోతి) : గత నాలుగు నెలలుగా జిల్లాలా వారీగా పర్యటించి కరోనా నిరోధక పనులపై సమీక్ష జరుపుతూ వచ్చిన ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి శనివారం నుంచి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. తన సొంత నియోజకవర్గంలో ఓట్ల వేట ప్రారంభించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు ప్రచారానికి సిద్ధమవు తున్నా యి. డీఎంకే ఎంపీ కనిమొళి, డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ఉద యనిధి స్టాలిన్ ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. మక్కల్ నీదిమయ్యం నేత కమల్‌హాసన్ కూడా వారం రోజులుగా ఎన్నికల ప్రచార పర్యటన లో ఉన్నారు.ఈ నేపథ్యంలో అన్నాడీ ఎంకే నేతలు కూడా ఎన్నికల ప్రచా రానికి సిద్ధమవుతున్నారు. ముఖ్య మంత్రి పళనిస్వామి తన సొంత నియోజకవర్గంలో శనివారం ఉద యం ప్రచారాన్ని ప్రారంభించను న్నారు. ఉదయం తొమ్మిది గంటలకు తన నియోజకవర్గం పరిధి లో ఉన్న పెరియసేర్కై కారియపెరుమాళ్ ఆలయంలో ఎడప్పాడి ప్రత్యేక పూజ లు నిర్వహించి, తర్వాత అమ్మా క్లినిక్ ప్రారంభించిన అనంతరం ప్రచార పర్యటనకు బయలుదేరనున్నారు.