రోడ్డును తవ్వేసిన అధికారులు

ABN , First Publish Date - 2020-08-20T17:28:44+05:30 IST

రోడ్డును తవ్వేసిన అధికారులు

రోడ్డును తవ్వేసిన అధికారులు

చెన్నై: కరోనా వ్యాప్తి నియంత్రించేలా తమిళనాడు-ఆంధ్ర సరిహద్దు రోడ్డును రెవెన్యూ శాఖ అధికారులు తవ్వి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. తిరుపత్తూర్‌ జిల్లా నాట్రాంపల్లి సమీపంలో పంజూరు, పరిసర ప్రాంతాల్లో కొద్దిరోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. పంజూరు సమీపంలోని గాంధీనగర్‌ రోడ్డు మీదుగా ఎలాంటి అనుమతులు లేకుండా పలువురు ఆంధ్ర రాష్ట్రానికి రాకపోకలు సాగిస్తున్నారు. దీనిపై దృష్టి సారించిన రెవెన్యూ అధికారులు మంగళవారం సాయంత్రం ప్లొక్లయిన్‌ యంత్రం ద్వారా గాంధీనగర్‌ రోడ్డును తవ్వి, రాళ్లను అడ్డంగా ఉంచారు. కరోనా ప్రభావం తగ్గిన తరువాతే రోడ్డును పునరుద్ధస్తామని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-08-20T17:28:44+05:30 IST