11వ శతాబ్దంనాటి మహావీర్ శిల్పం లభ్యం
ABN , First Publish Date - 2020-08-20T17:27:01+05:30 IST
11వ శతాబ్దంనాటి మహావీర్ శిల్పం లభ్యం

చెన్నై: పుదుకోట జిల్లా గంధర్వకోట సమీపంలో ఉన్న మంగళాకోయల్ గ్రామ పొలాల్లో 11వ శతాబ్దంనాటి మహావీర్ శిల్పం బయల్పడింది. తంజావూరు తమిళ విశ్వవిద్యాలయ పురావస్తు శాఖ ప్రొఫెసర్ మణికంఠన్, పుదుకోట పురావస్తు పరిశోధన సంస్థ ఆర్గనైజర్ ముత్తుకుమార్‌తో కూడిన బృందం మంగళాకోయిల్‌లోని మురుగేశన్ అనే రైతు పొలాన్ని పరిశీలించారు. జైన మతగురువైన మహా వీర్ రాత్రి శిల్పాన్ని గుర్తించి అది 900 ఏళ్ల క్రితం చెక్కినదిగా నిర్ధారించారు. ఒకటిన్నర అడుగు వెడల్పు, మూడడుగల ఎత్తులో ఉన్న ఈ శిల్పాన్ని ప్రభుత్వ మ్యూజియంకు అప్పగించనున్నట్లు ప్రొఫెసర్ మణికంఠన్ తెలిపారు.