వృద్ధురాలి వద్ద నగలు, నగదు ఎత్తుకెళ్లిన కోతులు

ABN , First Publish Date - 2020-08-20T17:18:41+05:30 IST

వృద్ధురాలి వద్ద నగలు, నగదు ఎత్తుకెళ్లిన కోతులు

వృద్ధురాలి వద్ద నగలు, నగదు ఎత్తుకెళ్లిన కోతులు

చెన్నై: తంజావూరు జిల్లా తిరువయ్యారు గ్రామంలో ఓ వృద్ధురాలి ఇంట్లో ప్రవేశించిన కోతులు నగలు, నగదును ఎత్తుకెళ్లాయి. వీరమాంగుడికి చెందిన శారదాంబాల్‌ (70) ఒంటిరిగా గుడిసె ఇంట్లో నివసిస్తుంది. ఆమె ఉపాధి హామీ పనులకు వెళుతోంది. ఇంటి ముందు ఆమె బట్టలు ఉతు కుతున్న సమయంలో, అక్కడకు వచ్చిన పదికి పైగా కోతులు గుడిసెలోకి చొరబడ్డాయి. ఇంట్లో ఉన్న పచ్చి బియ్యం, అరటి పండ్లు, ఓ డబ్బాలో దారి ఉంచి నాలుగు గ్రాముల బంగారు ఉంగరం, నాలగు గ్రాముల కమ్మలు, రూ.25 వేల నగదు పట్టుకొని పారి పోయాయి. దీనిని గమనించిన శారదాంబాళ్‌ కోతుల వెంటపడినా అవి చిక్కకపోగా, నగలు, నగదును కూడా కింద వేయకుండా వెళ్లిపోయాయి. 

Updated Date - 2020-08-20T17:18:41+05:30 IST