బాంబుల సంస్కృతి లేదు: డీజీపీ

ABN , First Publish Date - 2020-08-20T13:34:53+05:30 IST

బాంబుల సంస్కృతి లేదు: డీజీపీ

బాంబుల సంస్కృతి లేదు: డీజీపీ

చెన్నై, (ఆంధ్రజ్యోతి): అన్నా డీఎంకే ప్రభుత్వ పాలనలో పోలీసులకే రక్షణ లేదని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ధ్వజమెత్తారు. తూత్తుకుడిలో మంగళ వారం ఉదయం పేరు మోసిన రౌడీ విసిరిన బాంబు పేలి కానిస్టేబుల్‌ మృతి చెందిన సంఘ టన తీవ్ర దిగ్ర్భాంతి కలిగించిందని, కానిస్టేబుల్‌ కుటుంబసభ్యు లకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నా నని తెలిపారు. ఈ మేరకు బుధవారం స్టాలిన్‌ తన ట్విట్టర్‌లో ఓ ప్రకటన జారీ చేస్తూ అన్నాడీ ఎంకే పాలనలో సామాన్య ప్రజలకు భద్రత కరువైందని, ప్రజలను కాపాడాల్సిన పోలీసుల ప్రాణాల కు కూడా రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తూత్తుకుడిలో హత్యకేసులో నిందితుడిగా ఉన్న పేరుమోసిన రౌడీని పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసులపై బాంబు దాడి జరుగటం, ఆ దాడిలో కానిస్టేబుల్‌ మరణించారని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన అన్నాడీఎంకే ప్రభుత్వ వైఫల్యాన్ని రుజువు చేస్తోందని, పోలీసుల ప్రాణాలకు భద్రత కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఇకనైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసుల ప్రాణాలకు భద్రత కల్పించేదిశగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలని స్టాలిన్‌ ఆ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 


బాంబుల సంస్కృతి లేదు: డీజీపీ

ఇదిలా ఉండగా కొన్ని స్వల్ప సంఘటనలను ఉదాహరణగా చూపి రాష్ట్రంలో బాంబుల సంస్కృతి పెరిగిందని ఆరోపించటం సబబు కాద ని డీజీపీ త్రిపాఠీ హితవు పలికారు. తూత్తుకుడి లో నాటు బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్‌ సుబ్రమణ్యం కుటుంబీకులను పరా మర్శించేందుకు త్రిపాఠీ బుధవారం తూత్తుకుడి వెళ్ళారు. సుబ్రమణ్యం చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం త్రిపాఠీ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు మృతి చెందితే వారి కుటుంబాలకు ఆర్థికసాయం అందిం చటంలో ఎలాంటి తారతమ్యాలు పాటించడం లేదన్నారు. రాష్ట్రంలో పోలీసులకు రక్షణ లేదని చెప్పడం భావ్యం కాదని, ఊహించని సందర్భా ల్లోనే తూత్తుకుడిలో జరిగిన వంటి కొన్ని సంఘ టనలు అరుదుగా జరుగుతుంటాయని చెప్పారు. పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఎంత కష్టిస్తున్నారో తనకు బాగా తెలుసని, ఇకపై పోలీ సులకు పటిష్ఠమైన భద్రత కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు.

Updated Date - 2020-08-20T13:34:53+05:30 IST